టమాటా గింజలు తింటున్నారా.. ఇది తెలుసుకోండి!
టమాట గింజలు కూరలో కలిసిపోతాయి. తెలియకుండానే వాటిని తినేస్తాం. అలా తినవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
టమాటా గింజల్లో ఫైబర్, మినరల్స్, విటమిన్ C, K, E ఉంటాయి. ఇవి అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని ఇస్తాయి.
టమాటాల్లో గింజల వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. కాబట్టి టమాటా గింజల్ని తినడం మంచిదే.
కొంతమందికి మాటిమాటికీ కడుపు నొప్పి వస్తుంది, వారు టమాటా గింజల్ని తినకూడదు.
జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉన్నవారు టమాటాల్ని గింజలు తొలగించి వండుకోవడం మేలు.
గింజలు తొలగించేందుకు.. టమాటాను మధ్యలోకి కోసి.. స్పూన్‌తో గుజ్జును తొలగిస్తే.. గింజలు కూడా బయటకు వచ్చేస్తాయి.
టమాటా గింజల్లోని లైకోపీన్ గుండెను కాపాడుతుంది, చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించి.. ధమనుల్లో మంటను తగ్గిస్తుంది.
టమాటా గింజల్లోని యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో విష వ్యర్థాలను తొలగిస్తాయి. క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా చేస్తాయి.
టమాటా గింజలు పొట్ట నిండిన ఫీల్ కలిగించి, ఆకలి తగ్గించి, అధిక బరువు పెరగకుండా చేస్తాయి.
టమాటా గింజల్లోని కాల్షియం, ఫాస్పరస్ ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి. కీళ్లనొప్పులు రాకుండా చేస్తాయి.
గుడ్డు ధర ఏ దేశంలో ఎంత?
ఇక్కడ క్లిక్ చెయ్యండి