గుడ్డులోని పచ్చసొన తినాలా..? వద్దా..?

మంచి ఆరోగ్యానికి గుడ్డు ఎంతో అవసరం. 

ఇందులోని పోషకాలు శరీర అభివృద్ధికి తోడ్పడతాయి.

అయితే చాలా మంది గుడ్డులోని పచ్చసొన తినడానికి ఇష్టపడరు. 

అందులో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా శరీరానికి మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తుందని నమ్ముతారు. 

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులను పెంచుతుందని వాదిస్తారు. 

గుండె ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని హెచ్చరిస్తారు. 

ఈ విషయంలో ప్రచారంలో ఉన్నవన్నీ అపోహలేనని నిపుణులు చెబుతున్నారు.

పచ్చసొన తింటే ఎంతో ఉపయోగం ఉంటుందని పోషకాహార, ఫిట్‌నెస్ నిపుణులు సూచన.

పచ్చసొన తింటే ఏదో అయిపోతుందని అనుకోవడం ఒక మిథ్యేనని వివరణ .

వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో, లంచ్‌లో, డిన్నర్‌లో.. ఇలా ఎప్పుడైనా తీసుకోవచ్చు.