Jobs: అధిక వేతనం అందించే 8 ఇంజనీరింగ్ ఉద్యోగాలు

వీరికి అధిక డిమాండ్ తో పాటు.. అధిక వేతనాన్ని సంస్థలు చెల్లిస్తున్నాయి. 

1. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అల్గారిథమ్ లు, మోడల్ లను డిజైన్ చేసిన అమలు చేస్తారు. ఇది ప్రస్తుతం అత్యంత వేగంగా వృద్ధి  చెందుతున్న రంగం.

2. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ వివిధ పరిశ్రమల కోసం ఏఐ పరిష్కారాలను రూపొందించి అమలు చేయగల ఏఐ ఇంజనీర్లు అత్యంత విలువైనవారు.

3. డేటా సైంటిస్ట్ డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో సంస్థలకు సహాయం చేయడానికి డేటా సైంటిస్ట్ లు ఉపయోగపడతారు.

4. బ్లాక్ చెయిన్ డెవలపర్స్.. బ్లాక్ చెయిన్ ఆధారిత పరిష్కారాలను రూపొందించలగల నిపుణుల కోసం డిమాండ్ రాను రాను పెరుగుతోంది.

5. క్లౌడ్ సొల్యూషన్స్ అర్కిటెక్ట్.. వివిధ పరిశ్రమల్లో డిమాండ్ లో అధిక వేతనం చెల్లించే వాటిలో ఈ రంగం కూడా ఉంది.

6. DevOps ఇంజనీర్. సాఫ్ట్ వేర్ డెలివరీని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తారు. సాఫ్ట్ వేర్ రంగంలో అధిక డిమాండ్ ఉన్న రంగాల్లో ఇది కూడా ఒకటి.

7.స్టాక్ డెవలపర్.. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్ మెంట్ రెండింటిలోనూ ప్రావీణ్యం కలిగి ఉంటే.. అధిక వేతనాలను పొందుతారు.

8. సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్.. డిజిటల్ బెదిరింపుల నుంచి సంస్థలను రక్షించే నిపుణులకు  ఎక్కువగా డిమాండ్ ఉంది.