Loan Waiver: రుణమాఫీ లిస్ట్ లో మీ పేరు ఉందా..

ప్రభుత్వం గురువారం విడుదల చేసిన రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది.

రూ.లక్ష లోపు పంట రుణం పొందిన రైతులు సంతోషంతో ఉంటే.. కొందరి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు.

దీంతో  పలువురు రైతులు బ్యాంకులు, వ్యవసాయ విస్తరణాధికారులు, ఇతర అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

తెలంగాణలోని ప్రతీ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

తనకు ఎకరంన్నర భూమి ఉన్నందున కేవలం రూ.80 వేలు పంట రుణం తీసుకున్నానని ఓ రైతు చెప్పాడు.

తన భార్యకు ఎలాంటి రుణాలు అందలేదన్నారు. అయితే లబ్ధిదారుల జాబితాలో తన పేరు కనిపించలేదని వాపోయాడు.

తన పేరు రెండో జాబితాలో కూడా ఉంటుందో లేదో అని ఆందోళన చెందుతున్నాడు.

అయితే వ్యవసాయ అధికారులు మాత్రం అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పడం కనిపించింది.

అయితే ఇక్కడ తెలిపిన వెబ్ సైట్లో అర్హులైన రైతుల వివరాలు తెలుస్తాయి.

https://clw.telangana.gov.in/Login.aspx వెబ్ సైట్లో పేర్లను చెక్ చేసుకోవచ్చు.