ఈ ఐదు తింటే క్షణాల్లో మీ పొట్ట క్లీన్..

మారిన జీవనశైలి వల్ల చాలా మంది మలబద్ధకంతో బాధపడుతున్నారు. 

మలం విసర్జించేటప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఉంటే దాన్ని మలబద్ధకం అంటారు. 

దీని బారినపడినవారు వారానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే మల విసర్జన చేస్తుంటారు. 

విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, అసౌకర్యానికి దారితీస్తుంది.

రెగ్యులర్ డైట్‌లో ఈ ఐదు సూపర్ ఫుడ్స్ తింటే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఆకుకూరలు.. బ్రకోలీ, క్యాబేజీ, పాలకూర వంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆహారంలో చేర్చుకుంటే మలబద్దకం సమస్యను తగ్గించుకోవచ్చు. 

తాజా పండ్లు మలబద్ధకం నుంచి ఉపశమనం పొందాలంటే తరచుగా యాపిల్, బొప్పాయి, మామిడి, నారింజ వంటి పండ్లు తినాలి.

అవిసె గింజలు అవిసె గింజల్లో మలబద్ధకాన్ని తగ్గించే గుణాలు ఉంటాయి. 

చిక్కుళ్లు బీన్స్, చిక్కుడు, సోయా, గోరు చిక్కుడు వంటి కూరగాయలు మలబద్ధకం సమస్యని తగ్గిస్తాయి.

నీరు మలబద్ధకాన్ని నివారించడానికి ప్రతిరోజూ కనీసం 2 లీటర్ల నీరు తాగాలి.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.