నరాల బలం కోసం తినాల్సిన ఐదు సూపర్ ఫుడ్స్..

దీర్ఘకాలిక తలనొప్పి, కండరాలు బలం కోల్పోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, నరాల బలహీనత లక్షణాలు.

నరాలు శరీరానికి చాలా కీలకం. వీటి వల్ల మీ నాడీవ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంటుంది.

శరీరంలోని అన్ని భాగాలకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్ ను తీసుకెళ్లడానికి నరాలు సహాయపడతాయి.

అలాంటి నరాల బలం కోసం తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.

గుమ్మడి గింజలు.. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, కాపర్, ఐరన్ ఉంటాయి. ఇవన్నీ నరాలను రక్షించడంలో సహాయపడతాయి.

బ్లూబెర్రీ.. వీటిలో ఉండే యాంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు మీ నరాలు దెబ్బతినకుండా కాపాడతాయి.

సిట్రస్ ఫ్రూట్స్.. సిట్రస్ పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి నరాలను దెబ్బతినకుండా కాపాడతాయి.

ఆకుకూరలు.. ఈ కూరగాయల్లో విటమిన్ బీ పుష్కలంగా ఉంటుంది. నరాల నష్టాన్ని సరిచేయడానికి అవి అవసరం.

క్వినోవా.. క్వినోవాలో ఫోలేట్, విటమిన్ ఇ, బి6 నరాలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.