సెకండ్ హ్యాండ్ కారు కొనేవారికి 5 టిప్స్
కారును పైపై చూసి కొనేయవద్దు. కారు అందం కంటే, ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Car Condition- కారు సరైన కండీషన్లో ఉందో లేదో, అవసరమైతే మీ సొంత మెకానిక్‌తో చెక్ చెయ్యించండి.
కారును డ్రైవ్ చేసి చూడాలి.
ఇంజిన్
పనితీరు జాగ్రత్తగా చూడాలి. ప్రతీ యాంగిల్ నుంచి కారును గమనించాలి.
Maintenance Records- కారు సర్వీస్, మెయింటెనెన్స్‌పై పూర్తి చరిత్రను లోతుగా పరిశీలించాలి.
ఎక్కడ సర్వీసింగ్ చేశారో తెలుసుకోండి. మీరు కొన్నాక కారుకు ఎంతవరకు సర్వీసింగ్ అవసరమో పరిశీలించండి.
Car Insurance- కారుకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఉందో తప్పక తెలుసుకోండి. ఇది కీలక అంశం.
ఇన్సూరెన్స్ లేకుండా కారు డ్రైవ్ చెయ్యడం అనేది చట్ట విరుద్ధం. అలాంటి కారు కొనడం ప్రమాదకరం.
Test Drive- మొహమాటం లేకుండా కారును టెస్ట్ డ్రైవ్ చెయ్యండి. కొంత ఎక్కువ దూరమే వెళ్లండి.
టెస్ట్ డ్రైవ్ ద్వారా, కారు ఓనర్ చెప్పని చాలా విషయాలు మీకు స్వయంగా తెలుస్తాయి.
RC- కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను పూర్తిగా విశ్లేషించండి, ఆన్లైన్లో దాన్ని పరిశీలించండి.
ఒక్కోసారి RC డూప్లికేట్ ఉండొచ్చు. మీరు కొనే కారు RC నిజమైనదో, కాదో నిర్ధారించుకోండి.
More
Stories
పోషకాల గని దానిమ్మపండు
వైవాహిక జీవితంలో సమస్యలా? ఇలా చెయ్యండి
దుంపలతో తళతళ