ఇలా చేస్తే మందారం మొక్కకు పూలే పూలు!

చిన్న చిట్కాతో మందారం మొక్కకు బాగా పూలు వచ్చేలా చెయ్యవచ్చు.

ఒక ప్యాన్‌లో 500ml నీరు, 2 టీస్పూన్ల టీపొడి వేసి ఉడకబెట్టి.. ఆ నీరు చల్లారాక 1 లీటర్ నీటిని కలపండి.

ఆ నీటిని మందారం మొక్క చుట్టూ ఉన్న మట్టిలో పొయ్యండి.

ఈ చిట్కాతో మందారం మొక్కకు బాగా పూలు వూస్తాయి.

మీ ఇంట్లో చిన్న మొక్క మాత్రమే ఉంటే.. మీరు 1 టీస్పూన్ టీపొడిని మాత్రమే ఉపయోగించండి. 

మందారం పువ్వును తొలగించాక, పువ్వు కాడను కూడా తొలగించాలి. అప్పుడే కొత్త పూలు ఎక్కువగా వస్తాయి.

మందారం మొక్క నేల ఎప్పుడూ తడిగా ఉండాలి. ఐతే.. తడిగా ఉన్నప్పుడు నీరు పొయ్యవద్దు.

ప్రతి 6 నెలలకు ఓసారి మందారం మొక్క ఉన్న మట్టిని మార్చేయాలి. అప్పుడు పూలు బాగా పూస్తుంది.

మందారం మొక్క నుంచి రాలిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తొలగించాలి. వాటిని మొక్కకు ఎరువుగా వాడొద్దు.