ఈ ఐదు తింటే మీ గుండె సేఫ్..

గుండె జబ్బులు నుంచి ఉపశమనం పొందాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి.

ముఖ్యంగా పోషక విలువలు ఎక్కువగా ఉన్న నట్స్ డైట్‌లో చేర్చుకోవాలి. 

ఏ నట్స్ ఏవిధంగా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో పరిశీలిద్దాం.

* బాదం : బాదం పోషకాల గని. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. 

వీటిని రాత్రిపూట నానబెట్టి, ఉదయం తింటే చాలా మంచిది.

* వాల్‌నట్స్ : వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.

వాల్‌నట్స్ నుంచి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే వాటిని రాత్రిపూట నానబెట్టి, ఉదయం తినాలి.

* జీడిపప్పు : జీడిపప్పు మంచి పోషక విలువలున్న నట్. 

డైట్‌లో వీటిని చేర్చుకుంటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. 

* పీనట్ (వేరుశెనగ) : వివిధ రకాల విటమిన్స్, ఖనిజాలకు పీనట్స్ పవర్ హౌస్. 

ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 

* పిస్తా : పిస్తాపప్పుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. 

గుండె ఆరోగ్యంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.