కొన్ని రోజుల్లో గణేష్ చతుర్థి. గణపతి బప్పాను స్వాగతించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. స్వీట్లు, పండ్లు, పువ్వుల వరకూ గణపతి ఇష్టపడే 10 విషయాలు తెలుసుకుందాం.
గణేశుడికి కుడుములు అంటే చాలా ఇష్టం. బియ్యంపిడి, బెల్లం, కొబ్బరితో చేసే కుడుములు వినాయకచవితి స్పెషల్.
Modak
Modak
దూర్వా గడ్డి మొక్క వినాయకుడికి చాలా ఇష్టం. దీన్ని తరచుగా పూజ సమయంలో 21 ముడులతో సమర్పిస్తారు.
Durva
Durva
గణేశుడికి పువ్వులంటే ఇష్టం. ముఖ్యంగా మందారపువ్వు చాలా ఇష్టం. భక్తులు పూజ సమయంలో రకరకాల పువ్వులను సమర్పిస్తారు.
Red Jaswand Flower (Hibiscus)
Red Jaswand Flower (Hibiscus)
శంఖం నుంచి వచ్చే శబ్దం పవిత్రమైనది, స్వచ్ఛమైనదిగా భావిస్తారు. గణేశుడికి నాలుగు చేతులు ఉండగా.. ఒక చేతిలో శంఖం ఉంటుంది.
Shankh
Shankh
అరటి అంటే గణపతికి చాలా ఇష్టం. దీన్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.
Banana
Banana
కాంతివంతమైన రంగులంటే గణేశుడికి ఇష్టం. బంతిపువ్వు స్వామికి బాగా నచ్చుతుంది. డెకరేషన్ కోసం, పూజలో భక్తులు ఈ పువ్వులను వాడుతారు.
Marigold
Marigold
కుడుములతోపాటూ, స్వామికి మోతిచూర్ లడ్డూ అన్నా ఇష్టమే. చాలా ప్రతిమల్లో స్వామి ఓ చేతిలో కుడుము లేదా లడ్డూతో కనిపిస్తారు.