వినాయకుడి మొదటి తల ఎక్కడుంది?

వినాయకుడి జన్మ వృత్తాంతం అందరికీ తెలిసిందే.

పార్వతి దేవి వినాయకుడిని ఎలా సృష్టించిందో.. కోపంతో శివుడు అతడి తలను మొండెం నుంచి ఎలా వేరు చేశాడో అందరికీ తెలుసు

అయితే గణేశుడి మొదటి తల ఏమైందో తెలుసా?

పురాణాల ప్రకారం.. శివుడి త్రిశూలం గణేశుడి తలను ఛేదించినపుడు ఆ శిరస్సు భూమి కింద ఉన్న పాతాళ లోకంలోని ఒక గుహలో పడింది.

ఆ గుహను ఆది శంకరాచార్యులు కనుగొన్నట్లు చెబుతారు.

ఈ గుహ ఉత్తరాఖండ్ లోని పితోర్‌ఘర్ లోని గంగోలిహట్ కు 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆ ప్రదేశాన్ని పాతాళ్ భువనేశ్వర్ అని పిలుస్తారు.

ఇక్కడ ఉన్న గణేశుడి తలను శివుడు స్వయంగా రక్షిస్తుంటాడని ఒక నమ్మకం ఉంది.