పిల్లలకు అతిగా పాస్తా పెడుతున్నారా?

ఈమధ్య రెడీ టూ ఈట్ ఫుడ్‌ని భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

మ్యాగీ, పాస్తా వంటి వాటిని స్కూల్ పిల్లలకు చేసి ఇస్తున్నారు.

వెంటనే తయారుచెయ్యడానికి ఇవి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటున్నాయి.

పాస్తాను గోధుమ పిండిలో గుడ్లు లేదా నీరు కలిపి తయారుచేస్తారు.

పిల్లలకు ఈ ఫుడ్ బాగా నచ్చుతుంది. రుచికరంగా ఉంటుంది.

పాస్తాను అతిగా పిల్లలకు పెడితే, ఆరోగ్యానికి ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.

పాస్తాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి.

కప్పు పాస్తాలో 200 కేలరీలు, 40 గ్రా కార్బోహైడ్రేట్స్, 6 గ్రా ప్రోటీన్, 2 గ్రా ఫైబర్ ఉంటాయి.

అధికబరువు, ఆస్తమా ఉన్న పిల్లలకు పాస్తా పెట్టొద్దని నిపుణులు చెబుతున్నారు.

8 ఏళ్ల లోపు పిల్లలకు రోజుకు 1 కప్పు కంటే ఎక్కువ పెట్టొద్దని అంటున్నారు.

పాస్తా తినిపించే విషయంలో పిల్లల ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ, జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.