Jobs In DRDO: బీటెక్ అర్హతతో.. DRDOలో ఉద్యోగాలు

ఇంజినీరింగ్‌ పూర్తి చేసి గేట్‌లో మంచి స్కోరు సాధించిన విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. 

రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (DRDO)లోని సైంటిస్ట్‌ 'బి' ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలు కాగా.. ఆగస్టు 31వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 

ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.drdo.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 204 సైంటిస్ట్‌ 'బి' ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 

వీటిలో డీఆర్‌డీవోలో 181, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(డీఎస్‌టీ)లో 11, ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఏడీఏ)లో  6 ఖాళీలు ఉన్నాయి. 

కాలేజ్‌ ఆఫ్‌ మిలటరీ ఇంజినీరింగ్‌( సీఎంఈ)లో ఆరు చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు వయో పరిమితి విధించారు.

అన్‌రిజర్వుడ్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 35 ఏళ్లు మించరాదు.