TS JOBS: తెలంగాణ సచివాలయంలో ఉద్యోగాలు..
తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.
మొదటి సారిగా సచివాలయంలో సిబ్బందిని నియమించుకునేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వీటిని పూర్తిగా ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు.
మొత్తం జీఏడీ విభాగంలో 23 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో సేవలందించడానికి కొత్తగా 23 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.
ఇందులో 3 డేటా ఎంట్రీ ఆపరేటర్, 20 భద్రతా విభాగం సిబ్బంది పోస్టులున్నాయి.
అన్నింటినీ పొరుగుసేవల విధానంలో భర్తీ చేయనున్నట్లు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.