పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.5 తగ్గింపు?

వాహనదారులకు తీపికబురు.

ఫ్యూయెల్ రేట్లు దిగి వచ్చే ఛాన్స్ ఉంది. 

పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.5 వరకు తగ్గొచ్చు.

జేఎం ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూషన్ సెక్యూరిటీస్ నివేదికలో పేర్కొంది.

కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు నవంబర్ లేదా డిసెంబర్ నుంచి ప్రారంభం కావొచ్చు.

అందుకే దీపావళి సమయంలో ఫ్యూయెల్ ధరలను కేంద్రం తగ్గించొచ్చు. 

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ఎక్సైజ్ సుంకం తగ్గింపు రూపంలో ఉండొచ్చు.

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గించేసింది. 

తగ్గింపు ఆగస్ట్ 30 నుంచే అమలులోకి వచ్చింది.