TSPSC: టీఎస్పీఎస్సీ గ్రూప్ 3 పరీక్ష.. 

తెలంగాణ గ్రూప్‌-3 ఉద్యోగ ప్రకటనలో అదనంగా మరో 13 పోస్టులు చేరిన విషయం తెలిసిందే. 

ఈ ప్రకటనతో మొత్తం ఉద్యోగాల సంఖ్య 1,388కి చేరింది.

గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 29, 30వ తేదీన నిర్వహించనుండగా.. 

గ్రూప్ 3 పరీక్షను అక్టోబర్ లో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

అక్టోబర్ మొదటి వారంలో జేఎల్ పరీక్షలు ఉండగా.. రెండో వారంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. 

ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

మొత్తం మూడు పేపర్లకుగానూ 450 మార్కులకు గ్రూప్‌ 3 రాత పరీక్ష నిర్వహిస్తారు.

తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో ఈ పరీక్షా పత్రం  ఉంటుంది. 

పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ సందర్శించొచ్చు.