తెల్ల వెంట్రుకల్ని తీసేస్తున్నారా?
తలలో తెల్ల వెంట్రుకలు రాగానే లాగేస్తారు చాలా మంది.
హెయిర్ నల్లగా కనిపించేందుకు హెయిర్ డైలు, హెన్నాలూ చాలా ఉన్నాయి.
హెయిర్ డైల వల్ల జుట్టు నెల రోజుల కంటే ఎక్కువ కాలం నల్లగా కనిపించదు.
జనరల్‌గా ఎవరికైనా 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో తెల్ల వెంట్రులకు రావడం మొదలవుతుంది.
వెంట్రుకల్లో మెలనిన్ అనే పదార్థం తగ్గిపోయినప్పుడు అవి గోధుమ, తెలుపు రంగులో కనిపిస్తాయి.
వయసు పెరిగేకొద్దీ మన శరీరంలో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది.
జుట్టు కుదుళ్ల దగ్గర ఈ మెలనిన్ ఉంటుంది. ఇది గొట్టాల లాంటి వెంట్రుకల్లోకి వెళ్తుంది. అందుకే వెంట్రుకలు నల్లగా కనిపిస్తాయి.
తెల్ల వెంట్రుకలలో మెలనిన్ రేణువులు దాదాపు ఉండవు. గోధుమ రంగు వెంట్రుకల్లో ఇవి ఓ మోస్తరుగా ఉంటాయి.
సాధారణంగా ముసలితనం మొదలైనప్పటి నుంచి తెల్లవెంట్రుకలు మొదలవుతాయి.
తెల్ల వెంట్రుకల్ని ఒక్కొక్కటిగా లాగేస్తే.. మరిన్ని వస్తాయనే ప్రచారం ఉంది. ఇందులో నిజం లేదని నిపుణులు తేల్చేశారు.
మెలనిన్ లేకపోవడం వల్లే వెంట్రుకలు తెల్లగా కనిపిస్తాయి తప్ప.. తీసేయడం వల్ల అవి ఎక్కువగా రావు అని చెబుతున్నారు.
నల్ల వెంట్రుకలు కావాలంటే మెలనిన్ ఉత్పత్తి పెరిగే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి :
చేపలు నిద్రపోతాయా?