ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు..

నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్. 

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ, భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 

 ‘హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్’ (HCL), వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

జూనియర్ మేనేజర్ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి అప్లికేషన్లను ఇన్వైట్ చేస్తోంది. 

మొత్తంగా 56 జూనియర్ మేనేజర్ పోస్టులను హెచ్‌సీఎల్ భర్తీ చేయనుంది. 

మైనింగ్, ఎలక్ట్రికల్, కంపెనీ సెక్రటరీ, ఫైనాన్స్, తదితర విభాగాల్లో వేకెన్సీలు ఉన్నాయి. 

ఈ పోస్టులకు అప్లై చేసే సమయంలో అభ్యర్థులు సరైన డిసిప్లైన్‌ని ఎంచుకోవాలని సూచించింది.

జులై 1 నుంచి దరఖాస్తులు ప్రారంభం.. 

అప్లై చేసుకునేందుకు జులై 21 తుది గడువు. 

ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, జనరల్ అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

మిగతా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

నెలకు రూ.30 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు జీతం..

పూర్తి వివరాల కోసం hindustancopper.comని సందర్శించండి.