సెక్స్ సమస్యలకు దివ్య ఔషధం యాలకులు
యాలకులు సువాసన, రుచి మాత్రమే కాదు, ఇంకా చాలా ప్రయోజనాలు కలిగిస్తున్నాయి.
యాలకులు శృంగారపరమైన సమస్యలకు చెక్ పెట్టగలవని పరిశోధనల్లో తేలింది.
ఈ రోజుల్లో టెన్షన్లు, బిజీ లైఫ్ స్టైల్, రెడీ టూ ఈట్ ఆహారపు అలవాట్ల వల్ల ప్రజల్లో శృంగార సామర్ధ్యం తగ్గిపోతోంది.
ఈ సమస్యను పరిష్కరించడానికి వెల్లుల్లి లాగానే యాలకులు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి.
శృంగార జీవితంలో సమస్యలు ఉన్నవారు యాలకులు ఎక్కువగా తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
రోజుకు 1 నుంచీ 2 యాలకులు తీసుకుంటే వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. నపుంసకత్వం లాంటి లైంగిక సమస్యలు దూరమవుతాయి.
సంభోగంలో ఎక్కువసేపు పాల్గొనే శక్తిని రెట్టింపు చెయ్యగలవు యాలకులు. అందువల్ల దంపతులకు యాలకులు ఎంతో మేలు.
చర్మంపై ఏర్పడే నల్ల మచ్చల్ని యాలకులు తగ్గిస్తాయి. అందువల్ల వీటిని రోజూ ఏదో ఒక రూపంలో వాడాలి.
యాలకులు వెంట్రుకలు చిట్లిపోనివ్వవు, ఊడిపోనివ్వవు. జుట్టు ఒత్తుగా, బలంగా, కుదుళ్లు గట్టిగా ఉండేందుకు ఇవి దోహదపడతాయి.
యాలకులు అధిక బరువును తగ్గిస్తాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. రోజూ రాత్రి వేళ ఓ యాలకను తినేయాలి.
యాలకులను టీలలో గానీ, ఇతరత్రా ఏ రూపంలో తీసుకున్నా.. అవి జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
యాలకులు గ్యాస్ సమస్యను పోగొడతాయి. చక్కటి నిద్ర వచ్చేలా చేస్తాయి. ఎముకల్ని గట్టి పరుస్తాయి.
More
Stories
ఈ గింజలతో 7 ఆరోగ్య ప్రయోజనాలు1
ఇంట్లో ఇవి వద్దు
సిలిండర్ ట్రిక్