మీకు ఇలా అవుతుంటే, కొబ్బరి నీళ్లు తాగండి

ఒక కొబ్బరిబోండాం, ఒక సెలైన్ బాటిల్‌తో సమానం అని అంటారు డాక్టర్లు.

రెండో ప్రపంచ యుద్ధంలో సెలైన్ కొరత రావడంతో గాయపడినవారికి కొబ్బరి బోండాలనే ఇచ్చారు.

లేత బోండాంలో 95 శాతం నీరు, 24 కేలరీల శక్తి ఉంటుంది. 100 గ్రాముల కొబ్బరి నీటి నుంచి 17.4 క్యాలరీల ఎనర్జీ లభిస్తుంది. 

కొబ్బరి నీళ్లు గుండెకు మేలు, వేడి తగ్గిస్తాయి, దాహం తీరుతుంది, ఎన్ని తాగినా బాడీలో కొవ్వు పెద్దగా ఏర్పడదు.

డయాబెటిస్  బాధితులు కొబ్బరి నీళ్లు తాగితే షుగర్ లెవెల్స్‌ తగ్గుతాయి. ఇన్సులిన్‌లో వేగం పెరుగుతుంది.

ఈ నీటిలోని మెగ్నీషియం, టైప్ 2 డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలుచేస్తుంది.

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చెయ్యడానికి కొబ్బరి నీళ్లు సరైన ఆప్షన్. మంచినీళ్ల కంటే ఇవి బాగా పనిచేస్తాయి.

కొబ్బరి నీళ్లలో ఫైబర్, విటమిన్ సి, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నీరసంగా ఉండేవారికి ఎనర్జీ ఇస్తాయి.

సూక్ష్మక్రిములు, విష వ్యర్థాల నుంచీ కొబ్బరి నీళ్లు మనల్ని కాపాడతాయి. బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి.

తల తిరగడం, కడుపులో గడబిడ వంటి వాటిని తరిమికొట్టడంలో కొబ్బరి నీళ్లకు తిరుగులేదు.

రోజూ కాకపోయినా, అప్పుడప్పుడూ అయినా కొబ్బరి నీళ్లు తాగితే, ఆరోగ్యంగా ఉండగలం.