మొక్కజొన్న పీచుతో ఆరోగ్యం
మొక్కజొన్న గింజలను తీసి, పొట్టు పారేయడం మీరు గమనించి ఉండవచ్చు.
మనం చెత్త అనుకుంటూ పారేసే ఈ పీచులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
మొక్కజొన్నలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.
మొక్కజొన్న పీచులో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
ప్రముఖ భారతీయ డైటీషియన్ నిఖిల్ భట్ ఈ పీచుతో ప్రయోజనాలను వివరించారు.
డయాబెటిస్‌తో బాధపడేవారికి మొక్కజొన్న పీచు మేలు చేస్తుంది. రక్తంలో షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది.
అజీర్ణ సమస్యతో బాధపడే వారికి మొక్కజొన్న పీచుతో మంచి ఉపశమనం కలుగుతుంది.
మొక్కజొన్న పీచును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరగడం తగ్గుతుంది.
మొక్కజొన్న పీచుని గ్లాసు నీటిలో వేసి, మరిగించాలి. తర్వాత నిమ్మరసం కలిపి, టీ లాగా తాగాలి.
ఈ టీని పిల్లలు, గర్భిణీలు, మందులు వాడే వారు తాగకూడదు.
ఇది సాధారణ సమాచారం మాత్రమే. ఈ టీని తాగేముందు డాక్టర్ల సలహాలు తప్పక తీసుకోవాలి.
More
Stories
వీరు జామపండ్లను అస్సలు తినకూడదు
అశ్వగంధ వాడితే 12 ఆరోగ్య ప్రయోజనాలు
కరివేపాకులతో ఇలాచేస్తే!