వాల్నట్స్ని నీటిలో నానబెట్టి తినాలనీ, తద్వారా ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునేవారు ఇలా తినడం వల్ల త్వరగా మంచి ఫలితాలను చూస్తారు.
వాల్‌నట్స్‌లో ఫైటిక్ యాసిడ్, టాన్నిన్స్ ఉంటాయి. ఇవి కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటిని నాశనం చెయ్యగలవు. ఈ పోషకాలు శరీరం పొందకుండా చెయ్యగలవు.
వాల్నట్స్ని నీటిలో నానబెట్టి తింటే, ఫైటిక్ యాసిడ్, టాన్నిన్స్ ప్రభావం తగ్గిపోయి, శరీరానికి పోషకాలు బాగా అందుతాయి.
వాల్నట్స్ని నీటిలో నానబెట్టడం ద్వారా వాటిలో కాంప్లెక్స్ కాంపౌండ్స్ బంధం బలహీనపడుతుంది. తద్వారా శరీరం వాటిని జీర్ణం చేసుకోవడం తేలికవుతుంది.
నానబెట్టిన వాల్‌నట్స్‌లో పోషకాలను శరీరం వెంటనే గ్రహిస్తుంది. తద్వారా వేగంగా ఆ పోషకాల నుంచి ప్రయోజనం పొందేందుకు వీలవుతుంది.
వాల్నట్స్ని నానబెట్టినప్పుడు వాటిలో ఎంజైమ్స్ చురుగ్గా మారతాయి. అవి ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్‌ని శరీరం బాగా జీర్ణం చేసుకునేలా సహాయపడతాయి.
కొంతమందికి వాల్ నట్స్‌ని డైరెక్టుగా తింటే, అలెర్జీ సమస్యలు వస్తాయి. నానబెట్టి తింటే ఇలాంటి సమస్యలు అంతగా రావు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వాల్నట్స్ని ఓ గిన్నెలో వేసి, ఫిల్టర్ చేసిన నీటిని, ఆ నట్స్ మునిగేవరకూ పొయ్యండి. ఓ చిటికెడు ఉప్పు వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే, వెయ్యకపోయినా పర్వాలేదు.
రాత్రి 4 నుంచి 8 గంటలపాటూ వాల్నట్స్ని నీటిలో నాననివ్వండి. వాటిని వాడే సమయంలో, నీటిని తొలగించి, వాడండి.
Disclaimer: ఈ ఆర్టికల్‌లోది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి.