దెయ్యాలు ఎన్ని రకాలు?  (PART-1)

దెయ్యం పేరు వినగానే జడుసుకునే వారు ఎందరో

కొందరు జ్వరం కూడా తెచ్చుకుంటారు. 

దెయ్యాలను ఎవరూ చూడకపోయినా.. వాటి గురించి మాట్లాడుకోవడం అంటే సరదా

దెయ్యాలు ఎన్ని రకాలో ఇప్పుడు తెలుసుకుందాం

1. భూతం : భూతం అంటే నిజానికి దెయ్యం కాదు. కొత్తగా జ‌న్మించిన శిశువును భూతం అంటార‌ట‌.

శిశువు జ‌న్మించే స‌మయంలో ఆ దేహంలోకి ఓ ఆత్మ వ‌చ్చి చేరుతుంద‌ట‌. దాన్నే భూతం అంటారు. 

ఆ త‌రువాత ఆ ఆత్మ‌కు పూర్వ జ్ఞానం పోతుంది. అప్పుడు శిశువుకు ఏమీ గుర్తుండ‌వు.

2. ప్రేతం : హింస వల్ల చనిపోయిన వారు.. స్మశానంలో స‌రిగ్గా ద‌హ‌నం అవ‌ని మృత‌దేహాలు ప్రేతాలుగా మారుతాయట‌.

3. మోహిని : ప్రేమ విఫలమై చనిపోయిన వారు మోహినిగా మారుతార‌ట‌.

4. శాకినీ : వివాహం అయిన కొద్ది రోజుల‌కే మ‌రణించే మ‌హిళ‌లు శాకినీ దెయ్యాలుగా మారుతార‌ట‌. 

ఈ దెయ్యాలు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ట‌.

5. ఢాకినీ : మోహ‌నీ, శాకినీ రెండు దెయ్యాలు క‌లిపితే అప్పుడు ఢాకినీ దెయ్యం అవుతుంది. ఇవి చాలా ప్ర‌మాద‌క‌రం.