వర్షాకాలంలో ఎలుకలు రాకుండా చిట్కాలు

ఎలుకలకు చీకట్లో ఉండటం ఇష్టం. అందువల్ల మీ ఇంట్లో చీకటి ప్రదేశాలు లేకుండా చూసుకోండి.

మార్కెట్లో ఎలుకల బోన్లు లభిస్తాయి. వాటిలో ఉల్లిపాయ ముక్కను ఉంచితే.. ఎలుక చిక్కుతుంది. దూరంగా తీసుకెళ్లి వదిలేయవచ్చు.

రాత్రిళ్లు ఇంటి కన్నాలు, ఎంట్రీ పాయింట్స్‌ని మూసివెయ్యాలి. తద్వారా ఎలుకలు రాకుండా చేసుకోవచ్చు.

ఎలుకలకు పుదీనా వాసన నచ్చదు. ఇంటి మూలల్లో, కన్నాల దగ్గర పుదీనా ఉంచవచ్చు.

ఎలుకలకు నల్ల మిరియాలు అస్సలు నచ్చవు. ఎలుకలు తిరిగే ప్రదేశాల్లో నల్ల మిరియాల పొడిని చల్లాలి.

ఎలుకలకు లవంగాల వాసన, రుచి నచ్చదు. ఎలుకలు వచ్చే ప్రదేశాల్లో లవంగాల్ని ఉంచవచ్చు లేదా లవంగాల పొడిని చల్లవచ్చు.

వంటగది క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి. ఆహారం, నీరు ఫ్రీగా లభించకుండా చూసుకోవాలి. రాత్రిళ్లు కిచెన్‌లో లైట్ వేసి ఉంచడం మేలు.

అల్ట్రాసోనిక్ లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ డివైజ్‌లు మార్కెట్‌లో, ఆన్‌లైన్‌లో లభిస్తాయి. వాటి శబ్దం వల్ల ఎలుకలు ఇళ్లలోకి రావు. 

ఈ చిట్కాలతో ఫలితం లేకపోతే.. ఓ పిల్లిని పెంచుకోవడం మేలని నిపుణులు చెబుతున్నారు.