సన్‌ఫ్లవర్స్‌ని పెరట్లోని కుండీల్లో ఇలా పెంచుకోండి
పొద్దు తిరుగుడు పూల మొక్కల్ని ఇంటి కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
మీకు దగ్గర్లోని నర్సరీకి వెళ్లి లేదా ఆన్‌లైన్‌లో సన్‌ఫ్లవర్ విత్తనాలను కొనుక్కోవచ్చు. నాణ్యమైనవే కొనండి.
మరుగుజ్జు (dwarf) సన్‌ఫ్లవర్ జాతి మొక్కల విత్తనాలు కొనడం మేలు. అవి త్వరగా పూలు పూస్తాయి.
ఒక విత్తనం నుంచి వచ్చిన మొక్కకు, ఒక సన్‌ఫ్లవర్ వస్తుంది.
ప్రతి 10-14 రోజులకు ఓసారి విత్తనాలు వేస్తూ ఉంటే, వేసవి అంతా పూలు వస్తూనే ఉంటాయి.
కుండీ సైజు 30 నుంచి 41 సెంటీమీటర్లు ఉండాలి. కుండీలో 19 లీటర్ల మట్టి పట్టేలా ఉండాలి.
కుండీలో వేసే మట్టిలో పై భాగంలో 40 శాతం వర్మి కంపోస్ట్ వంటిది మిక్స్ చెయ్యాలి.
మట్టిలో ఒక అంగుళం తవ్వి, ఒక విత్తనాన్ని ఉంచాలి. విత్తనాల మధ్య దూరం 13 సెంటీమీటర్లైనా ఉండాలి.
విత్తనాలకు రోజూ నీరు పొయ్యాలి. ఈ మొక్కలకు మట్టి ఎప్పుడూ తడిగా ఉండాలి.
7 నుంచి 10 రోజుల్లో విత్తనాల నుంచి మొక్కలు వస్తాయి.
నీరు పోస్తూ, జాగ్రత్తగా పెంచితే, మొక్కలు బలంగా పెరిగి, పెద్ద పువ్వులు పూసి, ఇంటికి అందం తెస్తాయి.
More
Stories
ప్రపంచంలో బెస్ట్ తేనె ఇదే!
హిమాలయ ఫరాన్.. ఆయుర్వేదంలో దివ్యౌషధం
యాపిల్ వర్సెస్ జామ