బంగాళదుంప తొక్కలతో మొక్కలకు ఎరువు తయారీ

మొక్కలు బాగా పెరగాంటే వాటి సంరక్షణ అవసరం 

దీనికోసం మీరు ఖరీదైన ఎరువులు కొనుగోలు చేయాలి 

అయితే మీరు ఇంట్లోనే బంగాళదుంప తొక్కలతో మంచి ఎరువు తయారు చేసుకోవచ్చు

బంగాళదుంప తొక్కలతో కంపోస్ట్ తయారు చేయడం ఎలా ?

ఒక కంటైనర్‌లో నీరు,బంగాళదుంప తొక్కలు వేయండి 

ఇప్పుడు ఈ కంటైనర్‌ను నాలుగు రోజులు మూతపెట్టి ఉంచండి 

ప్రతీ రోజూ డబ్బ తీసి షేక్ చేస్తూ ఉండండి

నాల్గవ రోజు కంటైనర్‌లో నీటిని వడపోసి పెట్టుకోవాలి

ఇప్పుడు ఆ నీటిలో సమానమైన నీటిని కలపాలి 

ఈ నీరును మొక్కలకు పోస్తే మంచి ఎరువుగా పనిచేస్తుంది.