ఇలా చేస్తే.. దూది లాంటి ఇడ్లీలు మీ సొంతం!
ఉదయం వేళ మిగతా టిఫిన్ల కంటే ఇడ్లీ తింటే మంచిదట!
ఇడ్లీలో ఆయిల్ ఉండదు, ఆవిరితో ఉడుకుతాయి కాబట్టి ఆరోగ్యకరం.
అజీర్తి సమస్య ఉండే వారు కూడా ఇడ్లీ తింటే త్వరగా అరిగిపోతాయి.
మరి ఇడ్లీలు మెత్తగా, దూదిలా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం.
ఉదయం పూట ఇడ్లీ తయారీ కోసం సాధారణ బియ్యాన్నే వాడాలి.
కొంతమంది బాస్మతి బియ్యాన్ని ఉపయోగిస్తారు. ఆ బియ్యం అక్కర్లేదు.
బియ్యం, కడిగిన మినపప్పు ఎంత మోతాదులో వాడుతున్నారనేది కీలకం.
ప్రతి రెండు కప్పుల బియ్యానికి, ఒక కప్పు మినపప్పు వెయ్యాలి.
ఒకటిన్నర నుంచి 2 టీస్పూన్ల మెంతుల్ని కూడా కలిపి రుబ్బాలి.
మెంతుల వల్ల ఇడ్లీలు ఉడికాక, మెత్తగా, దూదిలా ఉంటాయి.
మోతాదు తక్కువే కాబట్టి, మెంతులు కలిపినా ఇడ్లీలు చేదుగా ఉండవు.
More
Stories
లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనంగా ఎలా అయ్యిందో తెలుసా?
రాశులపై నెగెటివ్ ఎనర్జీ ప్రభావం.. ఎవరిపై ఎలా ఉంటుందంటే?
కితకితల చెట్టు