ఉప్పును ఇలా తగ్గించండి

ఉప్పు సరిపడా తింటే ఆరోగ్యం, ఎక్కువైతే తీవ్ర అనారోగ్యాలే!

ఉప్పు ఎక్కువైతే శరీర భాగాలు ఉబ్బుతాయి. యూరిన్‌కి ఎక్కువగా వెళ్తారు.

బాడీలో ఉప్పు పెరిగితే హైబీపీ రాగలదు, హార్ట్ ఎటాక్ సమస్యా రావచ్చు.

మన నోటికి, రుచికి సరిపడా ఉప్పు మాత్రమే తినాలి.

కూర పూర్తిగా ఉడికాక, చివర్లో ఉప్పు వేస్తే.. తక్కువ ఉప్పు పడుతుంది.

పచ్చళ్లను తక్కువ తినాలి. అవి నిల్వ ఉండాలని ఉప్పు ఎక్కువ వేస్తారు.

స్ట్రీట్ ఫుడ్ తినడం తగ్గించాలి. వారు ఉప్పు ఎక్కువగా వాడుతారు.

కర్రీ పాయింట్లలో ఉప్పును ఎక్కువ, తక్కువ వేస్తుంటారు. ఆ కూరలు వాడటం తగ్గించాలి.

పండ్లపై ఉప్పు కాకుండా.. నిమ్మ పొడి, మామిడి పొడి వంటి వాటిని చల్లుకోవాలి.

ఏ ఆహారం తిన్నా, ప్రతి సారీ ఉప్పు డబ్బాను దగ్గర ఉంచుకోవద్దు.

ఈ చిట్కాలు పాటిస్తూ, ఉప్పు సరిపడా తీసుకుంటే, ఆరోగ్యంగా ఉంటారు.