మీ ఆహారంలో మునగను చేర్చడానికి 5 మార్గాలు!
మునగ చెట్టులోని భాగాలైన పువ్వులు, కాయలు, ఆకులు మనకు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
మునగలో జింక్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ బి1, మెగ్నీషియం, బి2, బి3, బి-6, పొటాషియం లభిస్తాయి.
మునగలో ఇంకా ఫోలేట్, ఆస్కార్బిక్ యాసిడ్ (విటమిన్ సి), ఐరన్, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు కూడా ఉన్నాయి.
దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశంలోని తూర్పు ప్రాంతంలో కూడా మునగ ఒక ప్రసిద్ధ ఆహార పదార్ధంగా ఉంది.
మునగ ఆకులు, కాయలు, పువ్వులను మీ ఆహారంలో చేర్చుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి తెలుసుకుందాం.
జీలకర్ర, వాము, నువ్వులు, ఇతర మీకు ఇష్టమైన దినుసులను మునగ ఆకులతో కలపి, ముద్దలు చేసుకోండి. వాటిని నూనెలో వేయిస్తే, వడ రెడీ.
మునగ వడ
రుచికరమైన, ఆరోగ్యకరమైన చపాతీలు చేయడానికి గోధుమ పిండిలో మునగ ఆకులు, కసూరి మేతి, నిమ్మరసం కలపండి.
మునగ చపాతీ
మునగ ఆకులు, పువ్వులు, పప్పు, మసాలా దినుసులను ఉడకబెట్టి చేసుకునే సూప్, రుచికరంగా ఉంటుంది.
డ్రమ్ స్టిక్ సూప్
సాంప్రదాయ సౌత్ ఇండియన్ మసాలా మిక్స్, మునగ కాయలతో చేసే సాంబార్ జీర్ణక్రియకు చాలా మంచిది.
మునగ సాంబార్
మునగ పువ్వులు, వెల్లుల్లి, మిరపకాయలు, శెనగ పిండిని ముద్దగా చేసి, వేడి నూనెలో డీప్ ఫ్రై చేస్తే, వడ రెడీ.
మునగ పువ్వుల వడ
ఇలా మునగ కాయలు, ఆకులు, పువ్వులు అన్నింటినీ, ఆరోగ్యాన్ని పెంచేందుకు ఆహారంలో చేర్చుకోవచ్చని చెఫ్‌లు చెబుతున్నారు.
More
Stories
ఏ వయసులో ఏ ఆహారం తినాలి?
మందారం మొక్కకు పూలే పూలు!
ఇల్లు అమ్మేందుకు వాస్తు