కొరియన్ గ్లాసీ స్కిన్ ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఈ లుక్ రావాలంటే కీలకపాత్ర పోషించే గ్లిజరిన్ ఎలా వాడాలో తెలుసుకుందాం.
టోనర్..
ఒక భాగం గ్లిజరిన్ ని మూడు భాగాల రోజ్ వాటర్ లో మిక్స్ చేసి గ్లిజరిన్ టోనర్ రెడీ చేయాలి. క్లెన్సింగ్ తర్వాత చర్మం హైడ్రేట్ గా ఉండటానికి ఈ టోనర్ వాడండి
మిస్ట్..
గ్లిజరిన్, అవోవెరా జెల్, నీళ్లు ఒక బాటిలో వేసి మిస్ట్ రెడీ చేసుకోండి. రోజంతా మీకు వీలు కాలిగినప్పుడల్లా మీ ముఖంపై స్ప్రే చేయండి.
మాస్క్..
గ్లిజరిన్, తేనెను కలిపి చిక్కని పేస్ట్ తయారు చేయండి. దీన్ని ముఖంపై అప్లై చేసి 15 నుంచి 20 నిమిషా తర్వాత వాష్ చేయండి. దీంతో మీ ముఖం మెరిసిపోతుంది.
సీరం..
గ్లిజరిన్లో విటమిన్ సీ సీరం కొన్ని చుక్కలు వేయాలి. పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి. హైపర్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది.
నైట్ క్రీం..
మీ నైట్ క్రీంలో గ్లిజరిన్ యాడ్ చేయండి. దీన్ని సున్నితంగా మర్దన చేయాలి.
గ్రీన్ టీ..
గ్రీన్ టీ ని తయారు చేసి చల్లారనివ్వాలి. దీనిలో గ్లిజరిన్ వేయాలి. దీంతో చర్మంపై ఉండే ఎరుపుమచ్చలు తొలగించి ఈవెన్ స్కిన్ లుక్ ఇస్తుంది.
గ్లిజరిన్ అలోవెరా లైట్ వెయిట్ సీరం తయారు చేయాలి. దీన్ని మాయిశ్చరైజర్ ముందు అప్లై చేయాలి. ఇది మీ స్కిన్ ను రక్షించడానికి అదనపు లేయర్ గా పనిచేస్తుంది.
గ్లిజరిన్ అలోవెరా లైట్ వెయిట్ సీరం తయారు చేయాలి. దీన్ని మాయిశ్చరైజర్ ముందు అప్లై చేయాలి. ఇది మీ స్కిన్ ను రక్షించడానికి అదనపు లేయర్ గా పనిచేస్తుంది.
రైస్ వాటర్, గ్లిజరిన్ కలిపి టోనర్ తయారు చేసుకోవచ్చు. ఇది కూడా ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది.
ఐస్ క్యూబ్స్..
గ్లిజరిన్ , నీళ్లతో కలిపి ఐస్ ట్రే తో ఐస్ క్యూబ్స్ తయారు చేయాలి. ఉదయమే దీంతో రబ్ చేసుకుంటే చర్మరంధ్రాలు మూసుకుపోయి ఫ్రెష్ లుక్ కనిపిస్తుంది.