హైదరాబాద్ టాప్ అట్రాక్షన్స్..

చార్మినార్.. ఈ చారిత్రాత్మక కట్టడాన్ని 1591 సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడ  లాడ్ బజార్ మార్కెట్ కూడా ఎంతో ఖ్యాతి చెందింది.

గోల్కొండ వజ్రాలకు పేరుగాంచింది. దీనిపై నుంచి నగరం ఎంతో దూరం వరకు ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. దీని కట్టడం కూడా ఎన్నో ప్రత్యేకతలు కలిగింది.

రామోజీ ఫిల్మ్ సిటీ.. మీకు సినిమాలంటే మక్కువ? అయితే మీరు తప్పకుండా సందర్శించాల్సింది రామోజీ ఫిల్మ్ సిటీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఇండ్రస్ట్రీ

హుస్సేన్ సాగర్ మాత్రమే కాదు దాని చుట్టూ ఎన్నో ఆహ్లాదకరమైన దృశ్యాలు ఉన్నాయి. సాగర్ మధ్యలో బుద్దుడి విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

ఫలక్ నూమా ప్యాలస్.. ఇదో లగ్జరీ ప్యాలస్. ఈ ప్యాలస్ లో స్టే చేయడం కూడా కాస్త ఖర్చుతో కూడుకున్నది. ఈ ప్యాలస్ లో ఓ రెస్టారెంట్ ఉంది. ఈ కట్టడం గురించి వివరించడానికి స్థానికంగా గైడ్స్ కూడా అందుబాటులో ఉంటుంది.

సాలార్ జంగ్ మ్యూజియం.. ప్రపంచంలోనే ఈ మ్యూజియంలో ఎన్నో  కళలు, పురాతన వస్తువులు ఉన్నాయి.ఇందులో పెయింటింగ్స్, టెక్స్ టైల్స్, విగ్రహాలు కూడా ఉన్నాయి

శిల్పారామం.. ఇదో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విలేజ్. శిల్పారామం మన సంస్కృతికి, సాంప్రదాయలకు ప్రతీకగా నిలుస్తోంది.

లుంబినీ పార్క్.. ఇది హుస్సేన్ సాగర్ తీరానా ఉంది. ఇక్కడ ప్రతి వారాంతంలో ఎంతో మంది సందర్శకులు సేదతీరడానికి కుటుంబ సభ్యులతో వస్తారు. ఈ పార్క్ లో మ్యూజికల్ ఫౌంటైయిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

నెహ్రూ జూలాజికల్ పార్క్.. ఇందులో రకరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి.  ఇది ఫ్యామిలీ ఔటింగ్ మంచి స్పాట్

బిర్లా మందిర్.. ఈ వైట్ మార్బల్ టెంపుల్ లో వేంకటేశ్వర స్వామి కొలువై ఉంటాడు. గుట్టలపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ కట్టడం రాత్రి సమయంలో దేధిప్యమానంగా కనిపిస్తుంది.

మక్కా.. ఇది మన దేశంలో అతిపెద్ద మసీదుల్లో ఇది ఒక్కటి.  ఎంతో మంది ముస్లిం సోదరులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు నిర్వహిస్తారు.

చౌమహల్లా ప్యాలస్.. ఇది నిజాం పాలకులకు చెందిన ప్యాలస్. దీని నిర్మాణం కూడా ఎంతో చూడచక్కగా ఉంటుంది.  ఇందులో ఖిల్వత్ ముబారక్, దర్బార్ హాల్ ఉంది.

కుతుబ్ షాహీ టూంబ్స్.. ఇది గోల్కోండకు దగ్గర్లో ఉంది. ఇక్కడ కుతుబ్ షాహీరాజ వంశస్తులకు చెందిన స్మారకకట్టడం. ఈ చుట్టు పక్కల ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

ప్రపంచంలో అత్యధికంగా పర్యాటకులు సందర్శించే ద్వీపం ఏంటో తెలుసా?