ఎల్బీడబ్ల్యూ.. క్రికెట్ చూసే వారికి ఈ పదం సుపరిచతమే.
బౌలర్ వేసిన బంతి బ్యాటర్ చేతికి, బ్యాట్ కు కాకుండా ఇతర శరీర బాగాల్లో తగిలి.. వికెట్లను తగిలేలా ఉండి బౌలర్ అపీల్ చేస్తే అంపైర్ ఆ బ్యాటర్ ను ఎల్బీగా అవుటిస్తాడు.
అయితే ఇందులో కొన్ని రూల్స్ ఉంటాయి.
బౌలర్ వేసిన బంతి బ్యాటర్ లెగ్ సైడ్ (అవుట్ సైడ్ లెగ్ స్టంప్) పిచ్ కాకూడదు.
బంతి బ్యాటర్ బ్యాట్ కు, హ్యాండ్ గ్లౌవ్ కు తగలరాదు.
హాక్ ఐలో వికెట్లను తగిలేలా ఉండాలి.
ఇంపాక్ట్ అనేది ఇన్ లైన్ ఉండాలి. అంటే బంతి ప్యాడ్ కు తగిలేటప్పుడు వికెట్ టు వికెట్ (నీడ లోపలే ) ఉండాలి.
అయితే ఇందులో కొంచెం తిరకాసు ఉంది. బ్యాటర్ షాట్ ఆడినపుడు కచ్చితంగా ఇంపాక్ట్ ఇన్ లైన్ ఉండాలి. అలా ఉండకపోతే నాటౌట్ గా పరిగణిస్తారు.
అయితే ఇందులో అంపైర్స్ కాల్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా రివ్యూలో..
పిచ్, ఇంపాక్ట్, వికెట్లను తాకే సమయాల్లో బంతి సగం కంటే తక్కువ తాకేలా ఉంటే అప్పుడు ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన ఒరిజినల్ నిర్ణయానికే కట్టుబడి ఉంటారు.