ది బాస్

వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.

ప్రతి మ్యాచ్ లోనూ అదరగొడుతున్నాడు.

ఇంగ్లండ్ తో జరిగిన పోరులో 87 పరుగులతో జట్టును ఆదుకున్నాడు.

కీలక ప్లేయర్లు విఫలం అయిన చోట.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టుకు ఊపిరి పోశాడు.

ఈ ప్రపంచకప్ లో 398 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 4వ స్థానానికి చేరుకున్నాడు.

ఈ క్రమంలోనే రోహిత్ మరో రికార్డును సాధించాడు.

అంతర్జాతీయ క్రికెట్ లో 18 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.

మూడు ఫార్మాట్లలోనూ కలిపి రోహిత్ 18,040 పరుగులు చేశాడు.

ఇందులో వన్డేల్లో 10,510 పరుగులు చేశాడు.

టెస్టుల్లో 3,677.. టి20ల్లో 3,853 పరుగులు చేశాడు.

వన్డే ప్రపంచకప్ లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా రోహిత్ (7) ఉన్నాడు.