లిచీ పండ్లను ఎక్కువగా తింటే ప్రమాదమే!

అదిరిపోయే రుచి ఇచ్చే లిచీ పండ్లు సువాసనతో, తొక్క తీస్తున్నప్పుడు.. జ్యూస్ జారుతూ.. నోరూరిస్తాయి. ఎండల్లో తినేందుకు ఈ పండ్లు చాలా మంచివి. ఇవి ఎనర్జీ లెవెల్స్ పెంచుతాయి. మూడ్‌ని సరిచేస్తాయి. మనకు వానాకాలం వచ్చేసినా, ఈ పండ్లను హాయిగా తినవచ్చు. కాకపోతే వీటి ధర ఎక్కువే. కేజీ రూ.400 దాకా ఉంటాయి.

లిచీ పండ్లలో విటమిన్ సీ, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, ఫొలేట్ వంటి చాలా పోషకాలు ఉంటాయి. అందువల్ల ఈ పండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు.

Constipation: లిచీ పండ్లలో వాటర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఈ పండ్లు బాగా పనిచేస్తాయి. ఈ పండ్లు తియ్యగా, జ్యూసీగా ఉంటాయి. వీటి రుచి వీటిదే. మరే పండ్లలోనూ ఇలాంటి రుచి ఉండదు. అందుకే ప్రజలు వీటి ధర ఎక్కువైనా మళ్లీ మళ్లీ కొనుక్కొని తింటుంటారు. 

Vitamin C Benefits: మీరు ఒక్క లిచీ పండు తిన్నా చాలు.. ఆ రోజులో మీకు కావాల్సినంత విటమిన్ సీ లభిస్తుంది. ఈ పండు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని కాపాడుతుంది. కొత్త చర్మం వచ్చేలా చేస్తుంది. శరీరంలోకి విష వ్యర్థాలు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే ఐరన్‌‌లో పీల్చుకునే గుణాన్ని పెంచుతుంది.

Digestion: లిచీ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ మెరుగుగా అయ్యేలా చేస్తుంది. అందువల్ల తరచుగా లిచీ పండ్లు తినేవారికి కడుపులో సమస్యలు తగ్గిపోతాయి. కడుపులో మంట, అజీర్తి సమస్యలు ఉన్న వారికి ఈ పండ్లు ఉపశమనం కలిగిస్తాయి.

Energy: లిచీ పండ్లలో ఫ్రక్టోజ్ ఉంటుంది. అలాగే హై కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. అందువల్ల ఈ పండ్లు తినగానే ఎనర్జీ వెంటనే వస్తుంది. ఎక్కువ మంది ఎండాకాలం, ఇతర కాలాల్లో స్నాక్స్ రూపంలో ఈ పండ్లను తీసుకుంటారు.

Cancer and Heart: ఈ పండ్లు గుండెకు మేలు చేస్తాయి. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. ఈ పండ్లలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు.. గుండె మంటను తగ్గిస్తాయి. 

Weight loss: బరువు తగ్గాలి అనుకునేవారు.. లిచీ పండ్లను తినవచ్చు. తద్వారా వీటిలోని ఫైబర్.. ఆకలి అతిగా వెయ్యకుండా చేస్తుంది. తద్వారా స్నాక్స్ పెద్దగా తినరు. అందువల్ల ఓవర్ వెయిట్ అవ్వరు. బరువు తగ్గేందుకు వీలవుతుంది.

Weight gain: అంతా బాగానే ఉన్నా, లిచీ పండ్లను ఎక్కువగా తింటే, బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ పండ్లలోని ఫ్రక్టోజ్.. LDL కొలెస్ట్రాల్‌గా మారి.. బాడీలో కొవ్వు నిల్వలు పెరుగుతాయి. అందువల్ల రోజుకు 10 నుంచి 12 పండ్లను తినవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

అందువల్ల ఈ పండ్లను మితంగా తింటే ఆరోగ్యం, అతిగా తింటే అనర్థం అని అనుకోవచ్చు. అయినా రేటు ఎక్కువ కాబట్టి.. మనం అతిగా తినే సందర్భాలు తక్కువే.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. దీన్ని లెక్కలోకి తీసుకునే ముందు.. సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోండి.