Sports Jobs: క్రీడలతో ప్రభుత్వ ఉద్యోగం.. 

స్పోర్ట్ కోటా ఉద్యోగాలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.

క్రీడల్లో రాణించినవారికి కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటాలో కొలువులు లభించే అవకాశం ఉంది.

అయితే.. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లా రాణించాల్సి ఉంటుంది.

అంతర్జాతీయ, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటే, ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ.

పోలీస్‌ ఉద్యోగాల్లో కూడా క్రీడాకారులకు రిజర్వేషన్‌ ఉంది.

కానీ, వారు పాల్గొన్న క్రీడల స్థాయిని బట్టి వెయిటేజి ఉంటుంది.

క్రీడాకారులకు రిజర్వేషన్‌ ఉన్నప్పటికీ, పోటీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

పోటీ పరీక్షలోనూ మంచి మార్కులు పొందితేనే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.

కొన్ని మాత్రమే పరీక్షతో సంబంధం లేకుండా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.