ఇలా చేస్తే ఎసిడిటీ బాధ నుంచి రిలీఫ్
ఎసిడిటీతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
తిన్న ఆహారం జీర్ణం అవ్వక ఎంతో మంది ఇబ్బంది పడతారు.
నోటి నుండి దుర్వాసన ఇవన్నీ కూడా ఎసిడిటీ యొక్క లక్షణాలే.
ఈ చిట్కాలని పాటించడం వల్ల ఎసిడిటీ సమస్య నుండి బయటపడొచ్చు.
పుదీనా ఆకులతో ఎసిడిటీని దూరం చేసుకోవచ్చు.
ఉదయాన్నే నాలుగు ఐదు పుదీనా ఆకులు తీసుకుని నమిలితే ఎసిడిటీ తగ్గుతుంది.
భోజనం అయ్యాక 20 నిమిషాలు ఆగి ఆ తర్వాత కొబ్బరి నీళ్ళని తీసుకుంటే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.
భోజనానికి ముందు తులసి ఆకులని నమిలితే కూడా ఈ సమస్య ఉండదు.
చక్కెర లేకుండా కొంచెం పాలని చల్లగా తీసుకుంటే ఈ సమస్యకు చెక్
ఒక చెంచా నెయ్యి వేసి పాలను తీసుకుంటే కూడా ఎసిడిటికి పరిష్కారం
భోజనానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే సమస్య దూరం
ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో ఈ సమస్యకి దూరంగా ఉండొచ్చు.
ఇది కూడా చదవండి: ఈ జ్యూస్ తాగితే మలబద్ధకం ఉండదు.