మొహాలీ మొనగాడు
వన్డే ప్రపంచకప
్ ముంగిట టీమిండియా ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనుంది.
సెప్టెంబర్ 22 నుంచి 27 మధ్య మూడు వన్డేలను ఆసీస్ తో భారత్ ఆడుతుంది.
తొలి వన్డే 22న మొహాలీ వేదికగా జరగనుంది.
ఇక మొహాలీ గ్రౌండ్ లో కెప్టెన్ రోహిత్ శర్మకు ఘనమైన రికార్డే ఉంది.
ఇక్కడ 5 అంతర్జాతీయ వన్డేలు ఆడిన రోహిత్ 410 పరుగులు చేశాడు.
ఇందులో ఒక డబుల్ సెంచరీ.. రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
రోహిత్ సాధించిన మూడు డబుల్ సెంచరీల్లో ఒకటి మొహాలీ వేదికగానే 2017లో శ్రీలంకపై కొట్టాడు.
ఈ గ్రౌండ్ లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రోహిత్ శర్మ ఉన్నాడు.
అయితే ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు వన్డేలకు రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చింది.
అతడితో పాటు కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు కూడా తొలి రెండు వన్డేలు ఆడటం లేదు.
కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
ఈసారి ప్రపంచకప్ హాట్ ఫేవరెట్ ఈ జట్టే.. అన్ని విభాగాల్లోనూ సూపర్ స్ట్రాంగ్