ఈ గ్రౌండ్ అంటే కోహ్లీకి పూనకాలే

వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా దూకుడు కనబరుస్తోంది.

పాయింట్ల పట్టికలో టాపర్ గా కొనసాగుతోంది.

ఈ క్రమంలో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది.

అక్టోబర్ 19న బంగ్లాదేశ్ తో తలపడనుంది.

పుణే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

ఇక ఈ గ్రౌండ్ లో విరాట్ కోహ్లీకి ఘనమైన రికార్డే ఉంది.

7 మ్యాచ్ ల్లో 448 పరుగులు చేశాడు.

ఇందులో 2 సెంచరీలు.. 3 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం.

సగటు 64.

వన్డే ప్రపంచకప్ లో ఇప్పటికే రెండు అర్ధ సెంచరీలు చేశాడు.

బంగ్లాదేశ్ పై కూడా రెచ్చిపోయేందుకు సిద్దమయ్యాడు.