సూపర్ జోడీ

భారత్, పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా పడింది.

ఆదివారం వర్షం కురవడంతో మ్యాచ్ సాధ్య పడలేదు. దాంతో రిజర్వ్ డేకు వాయిదా వేశారు.

ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 24.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసింది.

రోహిత్ శర్మ (56), శుబ్ మన్ గిల్ (58) అర్ధ సెంచరీలు సాధించారు.

వీరిద్దరు తొలి వికెట్ కు 121 పరుగులు జోడించారు.

ఈ క్రమంలో రోహిత్-గిల్ జోడి సూపర్ రికార్డును సొంతం చేసుకుంది.

ఆసియా కప్ లో ఈ జోడికి ఇది రెండో 100 ప్లస్ పరుగుల భాగస్వామ్యం.

ఆసియా కప్ లో సచిన్-విరాట్ కోహ్లీ జంట రెండు సార్లు 100 ప్లస్ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

తాజాగా ఈ రికార్డును రోహిత్, గిల్ జోడీ సమం చేసింది.