తొలి మ్యాచ్ లో 22 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు.
అయితే తొలి టి20లో భారత్ ఓటమి పక్షానే నిలిచింది.
అయినప్పటికీ తిలక్ వర్మ బ్యాటింగ్ పై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఫ్యూచర్ స్టార్ గా తిలక్ వర్మను పేర్కొంటున్నారు.
తిలక్ వర్మ బౌలింగ్ కూడా చేయగలడు.
తిలక్ వర్మ ఎంట్రీతో టీమిండియా మిడిలార్డర్ కష్టాలు తీరుతాయని మాజీలు నమ్మకంగా చెబుతున్నారు.
టీమిండియాలో తర్వాతి సూపర్ స్టార్ గా తిలక్ వర్మను పేర్కొంటుండం విశేషం.