భారతదేశం గోల్డ్ షాపింగ్ ఎక్కడ చేస్తుంది?

భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. వేల ఏళ్లుగా స్వర్ణం వాడుతున్నారు.

భారతీయుల ప్రతీ ఇంటిలో తప్పనిసరిగా ఎంతో కొంత బంగారం ఉంటుంది. 

భవిష్యత్ అవసరాల కోసం భారతీయులు బంగారాన్ని కొనుక్కుంటున్నారు.

దేశంలో ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప్రజలు బంగారం కొంటున్నారు.

భారత్‌కి ఈ బంగారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?

దక్షిణాఫ్రికా లోని గనులు బంగారానికి ప్రసిద్ధి.

కానీ, భారతదేశానికి ఎక్కువ బంగారం స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది.

స్విట్జర్లాండ్ భారతదేశానికి బంగారు దుకాణంగా మారింది.

ఏప్రిల్‌లో స్విట్జర్లాండ్ నుంచి భారత్‌లోకి అత్యధికంగా బంగారం దిగుమతి అయింది.

ప్రపంచంలో బంగారం దిగుమతులలో స్విట్జర్లాండ్ అతిపెద్ద వనరు.

భారత్ బంగారం మార్కెట్‌లో దీని వాటా దాదాపు 40 శాతం. ఆ తర్వాత UAE, దక్షిణాఫ్రికా ఉన్నాయి.