ఇన్‌స్టాగ్రామ్‌‌లో కొత్త ఫీచర్‌.. లక్షల్లో లైక్స్ పక్కా..!

ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్‌కి గుడ్ న్యూస్. యూజర్స్‌కి కిక్ ఇచ్చే కొత్త అప్డేట్‌ వచ్చేసింది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా ఈ వీడియో రీల్స్‌కి మరింత కొత్త లుక్ వస్తుంది.

ఎవరు ఎక్కడ చూసినా సోషల్ మీడియా యాప్స్ స్క్రోల్ చేస్తూనే కనిపిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది. 

 తాజాగా ఇన్‌స్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్‌ని తీసుకువచ్చింది.

రీల్స్‌లో బహుళ ఆడియో ట్రాక్‌లను యాడ్‌ చేసే ఆప్షన్‌ను తీసుకొచ్చింది.

దీని ఫలితంగా యూజర్లు తమ రీల్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ట్రాక్‌లను యాడ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

తాజాగా ఈ కొత్త ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.

ఒక్క రీల్‌లో 20 వరకు ఆడియో ట్రాక్‌లను జత చేసి మీ కంటెంట్‌ను మరింత సృజనాత్మకంగా తీర్చిద్దడంతో పాటుగా మీ ఆడియోను టెక్ట్స్‌, స్టిక్కర్‌, క్లిప్స్‌కు అనుగుణంగా ఎంచుకోవచ్చు.

ఫలితంగా మీరు ఓ ప్రత్యేకమైన ఆడియో ట్రాక్‌ను సృష్టించే అవకాశం ఉంటుంది.

ఈ ఫీచర్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత.. యాప్‌లో వీడియో ఎడిటర్‌ ఆప్షన్‌ ఓపెన్‌ చేయాలి. ఆపై యాడ్‌ టు మిక్స్‌పై ట్యాప్‌ చేసి కావాల్సిన ట్రాక్‌లను ఎంచుకోవాలి.