ఎగిరే పాములు కాటేస్తే, ఏమవుతుంది?

ఎగిరే పాములను క్రిసోపెలియా (Chrysopelea) అంటారు. అలాగే.. ఫ్లైయింగ్ స్నేక్, గ్లైడింగ్ స్నేక్ అని కూడా పిలుస్తారు. 

ఇవి చాలా తెలివైన పాములు. పక్షులు ఎగరడాన్ని గమనించిన ఈ పాములు.. అలా ఎగరడం నేర్చుకున్నాయి.

రెక్కలు లేకపోయినా ఇవి సునాయాసంగా ఎగరగలవు. పక్షులాగా ఇవి గాలిలో పైకి ఎగరలేవు. ఎగురుతూ కిందకూ వెళ్లగలవు.

ఒక చెట్టుపై ఉండే పాము.. మరో చెట్టుపైకి ఎగరాలి అనుకుంటే.. ఆ చెట్టు ఎంత దూరం ఉంది, ఎంత వేగంతో ఎగరాలి అనేది నిర్ణయించుకొని.. ఒక్కసారిగా దూకుతుంది.

గాలిలో తేలుతూ, తలను ఆడిస్తూ, ముందుకి దూకుతూ.. దూసుకెళ్తూ.. వెళ్లాలనుకున్న చెట్టుపైకి ఈ పాములు వెళ్లిపోతాయి.

ఈ పాములకు విషం కొంత తక్కువగా ఉంటుంది. ఇవి కాటువేస్తే చిన్న చిన్న ప్రాణులే చనిపోతాయి. మనుషులకు అంత ప్రమాదకరం కాదని పరిశోధనలు తేల్చాయి.

సాధారణంగా ఈ పాములు గట్టిగా ఉండే చెట్టు బెరడు నుంచి ముందుకు దూకుతాయి. అవతలి చెట్టుపై తమ తోక చేరేవరకూ ఎగురుతాయి.

ఈ పాములు ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. అంటే.. వియత్నాం, కాంబోడియా, థాయిలాండ్, మయన్మార్, లావోస్, ఇండొనేసియా, ఫిలిప్పీన్స్, చైనా, ఇండియా, శ్రీలంకలో ఉంటాయి. 

బల్లులు, ఎలుకలు, కప్పలు, పక్షులు, గబ్బిలాలను మింగేస్తాయి. ఈ పాముల్లో పశ్చిమ ఇండియా, ఇండొనేసియాలో 5 రకాల పాముల్ని గుర్తించారు.

ఇవి ఎక్కువగా రాత్రిళ్లు తిరుగుతాయి. ఇవి 2 అడుగుల నుంచి 4 అడుగుల పొడవు పెరుగుతాయి. 

ఇండియాలో కూడా ఈ పాములు ఉన్నాయి కాబట్టి.. అడవుల్లో తిరిగేవారు.. చెట్లపై కూడా గమనిస్తూ వెళ్లడం మేలు.