రామసేతు వంతెన రాముడే కట్టాడా?

దీనికి సంబంధించి ఇస్రో శాస్త్రవేత్తలు కీలక విషయాలను వెల్లడించారు.

ఈ వంతెనను రాముడు నిర్మించాడని హిందువులు అంటుంటే..  సైంటిస్టులు మాత్రం నేచురల్‌గా నిర్మితమైన వంతెన అని చెబుతున్నారు.

గత కొన్నేళ్లుగా రామసేతు వంతెన నిర్మాణాన్ని ఎవరు చేపట్టారనేదానికి పలు భిన్న వాదనలు ఉన్నాయి.

ఎవరి వాదనలు వారికి ఉండగా.. భారతీయ అంతరీక్ష పరిశోధన సంస్థ-ఇస్రో నుంచి కీలక అప్‌డేట్‌ వచ్చింది.

రామసేతుకు సంబంధించి పలు రహస్యాల చేధనలో ఇస్రో మరో ముందడుగు వేసింది.

తాజాగా రామసేతుకు సంబంధించి అంతరిక్ష నుంచి తీసిన ఫోటోలను విడుదల చేసింది.

అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్‌-2 డేటాను వినియోగించి రామసేతు వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు రిలీజ్ చేశారు. 

భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల మేర ఉంటుందని, దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉంటుందని ఇస్రో అంచనా వేసింది.

ప్రస్తుతం ఈ రామ సేతువు 99.98 శాతం నీటిలో మునిగి ఉందంటుని తెలిపింది.

తమిళనాడులోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉంది. సున్నపురాయితో నిర్మించిన ఈ బ్రిడ్జ్‌ కాలక్రమేణా సహజంగా నిర్మించబడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఈ ప్రాంతంలోని పగడపు నమూనాలను కార్బన్ డేటింగ్ చేయగా ఈ వంతెన సుమారు 7,000-18,000 సంవత్సరాల పురాతనమైనదిగా తేలింది.