ఫ్రిజ్‌లో ఉల్లిపాయలు పెడుతున్నారా?

మనలో చాలా మంది ఉల్లిపాయల్ని ఫ్రిజ్‌లో పెడుతుంటారు.

డైరెక్టుగా పెట్టకపోయినా, ఉల్లిని కట్ చేసి ఉంచుతుంటారు.

రాత్రి ఉల్లిని కట్ చేసి, ఫ్రిజ్‌లో పెట్టి, తెల్లారి కూరగా వండుకుంటారు.

నిపుణులు మాత్రం ఇలా చెయ్యవద్దు అంటున్నారు.

ఫ్రిజ్‌లో తొక్కతీసిన ఉల్లిపాయలు, కోసిన ఉల్లి ముక్కలను పెట్టొద్దు.

కోసిన ఉల్లి, ఫ్రిజ్‌లోని బ్యాక్టీరియా పెరగడానికి కారణం అవుతుంది.

ఉల్లి వల్ల, ఫ్రిజ్‌లో మిగతా పదార్థాలకు బ్యాక్టీరియా వ్యాపిస్తుంది.

దీనివల్ల రకరకాల అనారోగ్యాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కట్ చేసిన ఉల్లిని ఫ్రిజ్‌లో పెడితే చేదుగా మారి టేస్ట్ పోతుంది.

ఉల్లిని కట్ చేసి, నిల్వ ఉంచితే, అందులో పోషకాలు తగ్గిపోతాయి.

అప్పటికప్పుడు కట్ చేసిన ఉల్లిని మాత్రమే వంటల్లో వాడాలంటున్నారు.