నిరుద్యోగులకు ముందే పండుగ.. రేపు 2 జాబ్ మేళాలు

రంపచోడవరం నియోజకవర్గంలో జాబ్ మేళా

నైపుణ్యాభివృద్ధి సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది.

టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ చదివిన వారికి శుభవార్త.

జీతం రూ.10,000 నుంచి రూ.20,000 వరకు వచ్చే అవకాశం.

రంపచోడవరం డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ఉంటుంది.

ఈనెల 26వ తేదీన నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతుంది.

ఉదయం 9 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు చేరుకోవాలి.

ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలి.

రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో సైతం 26న మెగా జాబ్ మేళా.

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ విషయాన్ని తెలియజేశారు.

నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు.

టెన్త్ నుంచి బీటెక్ వరకు చదివిన వారు అర్హులు.