3 వారాలకే ఓటీటీలోకి భారతీయుడు మూవీ..!
కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండియన్ 2 జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
రిలీజ్ ముంగిట ఈ సినిమాకు భారీ హైప్ వచ్చింది.
కట్ చేస్తే.. మొదటి రోజే ఫుల్ నెగెటీవ్ రివ్యూలు వచ్చాయి.
తొలిరోజు పట్టుమని పాతికకోట్ల షేర్ కూడా కలెక్ట్ చేయలేక ఈ ఏడాది తమిళంలో డిజాస్టర్ ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు రాబట్టింది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
ముందుగా ఈ సినిమాను ఆగస్టు 15న ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
కానీ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఆఫర్ చేయడంతో.. వచ్చే వారం స్ట్రీమింగ్ కాబోతుందని ఇన్ సైడ్ టాక్.
ఇలా మూడు వారాలకే భారతీయుడు 2 సినిమా ఓటీటీలోకి రాబోతుందన్నమాట.
అయితే దీనిపై క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది. ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ రోల్‌లో నటించాడు.
సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించాడు. రకుల్ ప్రీత్ సింగ్ సిద్దార్థ్ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించింది.
More
Stories
ఈ 5 వస్తువులను ఊరికే తీసుకోకండి, ఇవ్వకండి.
వుడ్ పెయింట్స్ అంటే ఏంటి?
పాము కాటు వేస్తే..