భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో శనివారం ప్రారంభమైన జీ20 సదస్సు ఆదివారం ముగిసింది
G20లో కొన్ని విషయాలు భారతదేశ దౌత్య బలాన్ని నిరూపించాయి
న్యూఢిల్లీ మేనిఫెస్టోకి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది
భారత్ నుంచి పశ్చిమాసియా మీదుగా యూరప్‌కు వాణిజ్య కారిడార్‌ను నిర్మించే ప్రాజెక్టుకు అంగీకారం కుదిరింది
6జీ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు భారత్,అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది
రూ. 8300 కోట్ల పునరుత్పాదక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏర్పాటుకి భారత్-అమెరికా అంగీకారం
ఆఫ్రికన్ యూనియన్ కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పిస్తున్నట్లు జీ20 సమావేశంలో ప్రధాని మోదీ ప్రకటించారు
ఈ కూటమిలోని దేశాలు ప్రపంచ ఉత్పత్తిలో 85 శాతం, వాణిజ్యంలో 75 శాతం వాటా కలిగి ఉన్నాయి
ఆదివారం ఉదయం రాజ్ ఘాట్ లో మహాత్ముడి సమాధి వద్ద నివాళులర్పించిన జీ20 నేతలు
ప్రపంచానికి 21వ శతాబ్దంలో కొత్త మార్గాన్ని చూపాల్సి ఉందని మోదీ అన్నారు