గర్భిణుల సుఖ ప్రసవం కోసం ఇలా.. 

గర్భిణి స్త్రీలు ఎక్కువగా బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల సిజేరియన్స్ పెరిగిపోయాయి.  నార్మల్ డెలివరీలు తగ్గిపోయాయి.

నార్మల్ డెలివరీ శాతాన్ని పెంచాలనే ఆలోచనతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గర్భిణి స్త్రీల కోసం ప్రత్యేకంగా వ్యాయామాలు చేయిస్తున్నారు.

ఎలాంటి వ్యాయామాలు చేస్తే సుఖ ప్రసవం అవుతుంది అనే విషయాలు ట్రైనర్స్ గర్భిణిలకు చెబుతున్నారు.

దీంతో నార్మల్ డెలివరీల శాతం రోజు రోజుకు పెరుగుతుందని ఆసుపత్రి సూపరిండెంట్ చెబుతున్నారు.

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గతంలో సిజేరియన్స్ ఎక్కువగా జరిగేవి.

సాధారణ ప్రసవాలు తక్కువగా అయ్యేవి.  నార్మల్ డెలివరీలు పెంచాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరిగింది.

దీంతో గర్భిణులకు సుఖప్రసవం చేయడమే లక్ష్యంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ యోగాలు చేయిస్తున్నారు.

ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

జీజీహెచ్ లో ఈ ఏడాది ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేసి ముగ్గురు కౌన్సిలర్లతో గర్భిణులకు యోగా సాధన, వ్యాయామం చేయిస్తున్నారు.