ఈ ఒక్కటి తింటే చాలు.. మలబద్ధకం మాయం!

ప్రస్తుతం చాలా మంది జీవనశైలి మారింది

ఎక్కువ మంది మలబద్ధకం (Constipation) సమస్యతో బాధపడుతున్నారు. 

మలబద్ధకం వస్తే ప్రశాంతంగా ఉండనివ్వదు. 

మీరూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? 

అయితే అల్లంతో మీకు మంచి ఉపశమనం లభిస్తుంది. 

అల్లం మలబద్ధకాన్ని ఎలా దూరం చేస్తుందో తెలుసుకుందాం.

అల్లంలో ప్రోటీజ్ జింగిబైన్ అనే కాంపౌండ్‌ ఉంటుంది. 

ఇది పొట్ట సంకోచాలను ప్రోత్సహిస్తుంది. 

వేగంగా పొట్టలోని గ్యాస్‌ను ఖాళీ చేసి, ఆహారం వేగంగా జీర్ణం అవ్వడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

రెగ్యులర్ డైట్‌లో అల్లం చేర్చుకుంటే కూడా మలబద్ధకాన్ని తగ్గించుకోవచ్చు.